Sunday, August 21, 2011

కృష్ణాష్టమి శుభాకాంక్షలు


ముద్దు గారే యశోద ముంగిట ముత్యము వీడు
దిద్దరాని మహిమల దేవకీ సుతుని కి జన్మ దిన శుభాకాంక్షలు
మీరు కూడా కృష్ణుని ఆహ్వానించండి
వెన్న ముద్దలు పెట్టండి

Friday, August 27, 2010

మదర్ తెరెసా



మదర్ తెరెసా

పుట్టిన రోజు 26 ఆగష్టు 1910, కాని తను మాత్రం తను బాప్తిసం తీసుకుని ఆర్తులకి సేవ మొదలెట్టిన రోజు 27 ఆగష్టు నే తను పుట్టిందంటుంది.
కనుచూపు లో కరుణ మాత్రమే చూపించగల దయామయీ , మనం ఏమి చేస్తున్నాం అన్నది కాదు, ఎంత ప్రేమ తో చేస్తున్నామో చూసుకోవాలి, ఎంత ఇస్తున్నామన్నది కాదు, ఎంత హృదయ పూర్వకం గా ఇస్తున్నామో కావాలి.
ప్రతి మనిషి లోను భగవంతుడే కనిపిస్తాడు నాకు,
కుష్టు రోగుల గాయాల్ని శుబ్రం చేస్తున్నప్పుడు , నేను దేవుడి కే ఉపచారాలు చేస్తున్నట్టు అనుకుంటాను , ఎంత అద్బుతమైన అనుభవమిది అంటారు తను, మన లో ఎంతమందిమి కోరుకుంటాము ఈ అనుభవం కావాలని?
"పేదల కి మనం ఇచ్చేదాని కన్నా వాళ్ళు మనకి ఇచ్చేదే ఎక్కువంటారు.
ప్రతి రోజు కి తినడానికి ఆహరం లేకపోఎన వారు బలం గానే ఉంటారు,
ఎవరిని శపించారు, ఎవరి మీద నిందలు వేయరు.
కానీ మన దగ్గర వాళ్ళకి ఇవ్వటానికి ఏమి లేవు, జాలి ,దయ తప్ప .
మనం పేదల నుండి చాలా నేర్చుకోవాలంటారు, తను.
తన కోసం కొంచమైన నేర్చుకుందామా కనీసం ఈ రోజు నుండైన, తనకి నివాళులు అర్పిస్తూ. . . . . .

Thursday, August 19, 2010

సంతోషానికి

మన సర్దార్జీ గారు అడవి లో నడుస్తూ వెళ్తుంటే ,
ఒక చెట్టు మీద పాము వేళ్ళాడుతూ కనిపించింది .
అప్పుడు ఆయన పాము తో ఇలా అన్నాడు,
" వూరికే వేళ్ళాడితే ఏమి కాదు , అమ్మకి చెప్పు complan (కాంప్లాన్ ) ఇవ్వమని "

$ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $

ఇలానే ఇంకో రోజు మన సర్దార్జీ గారిని ఒక కుక్క తరుముతుంది.
సర్దార్జినేమో పరుగెడుతున్నాడు ,నవ్వుతున్న్నాడు !
ఎందుకు నవ్వుతున్నావయ్య ? అని అడిగితే
నేనేమో Airtel వాడుతున్నాను, కాని నన్ను vodafone network ఫాలో అవుతుంది అన్నాడు .

* * * * * * * * * * * * * * * * * * * * *


Jr. NTR: చెస్ ఆడదాం రండి బాబాయ్.

బాలకృష్ణ : మీరు ఆడుతూ ఉండండి, నే వెళ్లి స్పోర్ట్స్ షూస్ వేసుకుని వస్తా .

* * * * * * * * * * * * * * * * * * * * *

అందరు అవును, కాదు అని సమాధానం చెప్పటం తేలిక అనుకుంటారు కదా .
అలాంటి వాళ్ళకి ఒక ప్రశ్న వేస్తాను , అవును, కాదు లలో సమాధానం చెప్పండి చూస్తాను . . . . . .
"ఏంటి మీరు గుళ్ళో చెప్పులు కొట్టేయడం మానేసారా? "

* * * * * * * * * * * * * * * * * * * * *

జీవితం లో ఎవేరిని తక్కువ అంచనా వేయొద్దు, ఆఖరికి మనం చేతి తో నలిపేస్తే చచ్చిపోయే చీమను కూడా . . . . .
ఎందుకంటే చీమ మన బుగ్గను కోరకగలదు, కాని
మనం చీమ బుగ్గను కొరకలేము కదా, అందుకని

హీరో- రవి తేజ

"మాదక ద్రవ్యాలతో పట్టుబడిన సినీనటుడు రవితేజ సోదరులు "
ఈ రోజు ఉదయం ఈనాడు పేపర్ లో ఈ న్యూస్ చూసినప్పుడు నాకు చాలా బాధ గా అనిపించింది.
ఇదే కాదు ఇంతకుముందు కూడా ఒకటి రెండు సార్లు ఇంకా వేరే ఏవో పిచ్చి పనులు చేసి వార్తల్లో కి ఎక్కారు వీరు (రవితేజ సోదరులు ).
నాకు తెలిసి సినీ రంగం లో ఎవరి అండ దండలు లేకుండా స్వయంకృషి తో పైకొచ్చిన వాళ్ళలో రవితేజ గారు ఒకరు, పాపం ఆయన ఇంకా ఆ స్థానాన్ని పదిలపరుచుకోవడానికి కష్టపడుతూనే ఉన్నారు.
అలాంటి తనకి వీలైతే తమవల్ల ఐయ్యే సహాయం చేయాలి గాని , ఇలా తను తెచ్చుకున్న పేరు ప్రతిష్టలని కూడా వాళ్ళు చేసే వేదవ పనులతో చెడగొట్టే తమ్ముళ్ళు ఉండటం నిజం గా రవితేజ గారి దురదృష్టం.

Tuesday, August 17, 2010

కబుర్లు

1935 లో అమెరికా ప్రభుత్వం ఆగష్టు నెల మొదటి శనివారం ఒక పౌరున్ని
ఏదో కారణం మీద చంపివేసిందట,
ఆ తరువాత రోజు అతని జ్ఞాపకాలతో అతని స్నేహితుడు ఒకరు
ఆత్మహత్య చేసుకున్నాడట.
అప్పటి నుండి అమెరికా ప్రభుత్వం ఆగష్టు మొదటి ఆదివారాన్ని
స్నేహితుల దినం గా ప్రకటించిదట !
* * * * * * * * * * * * * * * *

జీవితం లో చాలా వర్ణాలున్నై. . . . . .
అమ్మ తెలుపు ,నాన్న నీలం,
కుటుంబం హరితం,
ప్రేమికుడు ఎరుపు,
కళత్రం(wife) గులాబీ ,
కాని . . . . . .
స్నేహితులు మాత్రం హరివిల్లు

స్నేహితుడు

గాయం + స్నేహితుడు =అఒశధమ్ (medicine)
ఒంటరితనం + స్నేహితుడు =భాగస్వామ్యం
దుఖం + స్నేహితుడు =చిరునవ్వు
దూరం + స్నేహితుడు =గమ్యం
ఇంకా క్లుప్తం గా
శూన్యం + స్నేహితుడు = అనంతం . . !

శుభోదయం

మంచి సరైన (perfect) ఉదయం ఎలా ఉండాలో ? క్రిందివి చదివి నేర్చుకోండి
1) ఉదయాన్నే కళ్ళు తెరవండి
2) వొళ్ళు విరవాలి
3) ఉదయపు తాజాతనాన్ని అనుభూతి చెందాలి
4) గట్టి గా ఊపిరి తీసుకోవాలి
5) ఇప్పుడు చెప్పండి
"అబ్బ చాలా త్వరగా లేచాను
ఇంకాసేపు పడుకోనివ్వు" అని