Sunday, August 15, 2010

నమ్మితే నమ్మండి

మనుషులందరికీ బరువు అన్నది ఎక్కడ ఉన్న ఒక సమస్యే , ఆ పదం ఎక్కడ ఉన్న, విన్న ఇబ్బంది నే కలిగిస్తుంది . ఉదాహరణకి మనం నెల వారి వెచ్చాలు కొనుక్కుందామని ఒక బడ్జెట్ వేసుకుని వెళ్తే తీరా అక్కడికి వెళ్ళాక కాస్తయిన దేని బరువైన మనమనుకున్నదాని కన్నా పెరిగిన, బంగారం కొనే దగ్గర పెరిగిన, పెరిగిన కూరగాయల ధర ల కాలం లో మనం కొనే కూరగాయల దగ్గర ఐన, పంపే పోస్ట్ ల దగ్గర, మన ప్రయాణాలలో లో . . . . . . ఇలా ఒకటేంటి? చెప్తూ పోతే చాలానే ఉంటాయి.
సాదారణంగా మనం కూడా ఎక్కడైనా బరువు తగ్గించుకోవాలనే చూస్తాం, మన శక్తి కొలది ప్రయత్నిస్తాం కూడా , ఇలాంటి ప్రయత్నమే మా పోరుగింటావిడ చేస్తుంది,
ఏ విషయం లో అనుకుంటున్నారు?
ఆవిడ గారి స్థూలకాయం గురించి. . . . ,
ఇంతకి ఆవిడ బరువు తగ్గించుకోవడానికి పడే పాట్లేంటంటే. . . .,
రోజు గుడి కి వెళ్లి దేవుడిని ప్రార్దించడం(బరువు తగ్గించమని కాదులెండి, అది ఆయన చేతిలో లేదని తనకి తెలుసు),
వర్షాలు బాగా కురిపించమని.
అదేంటి ?
బరువు కి, వర్షానికి ఏంటి సంబంధం?
నాకు ఎంత ఆలోచించిన తట్టలేదు.
ఇంకొకటి ఏంటంటే, ఈ మద్య వర్షం మొదలవగానే మా పక్కింటి వాళ్ళ ఇంట్లో వస్తువులన్నీ (అంటే గిన్నెలు, చెంబులు, పెద్ద పెద్ద బేసిన్లు లాంటివి) పైన కన్పిస్తున్నాయి (మేముండేది మొదటి అంతస్తులో)
(వీళ్ళకి మునిసిపాలిటి వాళ్ళు ఇచ్చే పంపు నీళ్ళు సరిపోవట్లేదేమో అనుకునేవాళ్ళం)
చివరికి ఇక ఊరుకోలేక మా అమ్మ ఆవిడని అడిగేసింది, ఏంటి విషయం అని . . . . .
తను చెప్పింది విని ఆశర్యపోవడం మా అమ్మ వంతైంది.
ఇంతకీ విషయం ఏంటంటే, వర్షం నీళ్ళు తాగితే బరువు తగ్గుతారని ఎవరో చెప్పారట, అందుకని వర్షాలు బాగా పడితే ఆ నీళ్ళు తాగొచ్చు కదా అని. . .
తన ఆశ. అందుకే తన మొర ఆలకించి దేవుడు వర్షాలు ఇస్తున్నాడట.
గత నెల రోజుల నుండి పడుతున్న విస్తారమైన వర్షం నీళ్ళు తాగి తను ఇప్పటికే కే.జి న్నర బరువు తగ్గిందట, ఇలానే ఇంకో 4 నెలలు పడితే నేను చక్కగా ఈ ఏడాది 8 కే . జి లు తగ్గుతానని లెక్కలు వేసుకున్టుదట.
నిజమే అంటారా?
అమ్మో ఇలా అయితే ఒబేసిటీ క్లినిక్ లు , డాక్టర్లంతా , లావు గా ఉన్న వాళ్ళందరిని ఎంత మోసం చేస్తున్నారో వేలకి వేలు డబ్బులు గుంజుతూ. . . .
పాపం , ఎవేరైన మీకు తెల్సిన వాళ్ళుంటే ఈ విషయం చెప్పి వాళ్ళ సమయాన్ని ,డబ్బు ని కాపాడన్డెం#@#**
ఏమో ఏ పుట్టలో ఏ పాముందో?
సాక్షాత్తూ భగవంతుడే తనని నమ్మి వర్శాలిచ్చాడు అంటుంటే మీరు మాత్రం నమ్మక ఏం చేస్తారులెండి.
చెప్పిన విషయాన్నీ నమ్మడం, నమ్మకపోవడం మీ ఇష్టం
జరిగిన సంభాషణ మాత్రం వాస్తవం.
మనమంతా అంత ముర్ఖులం కాదన్నది నా నమ్మకం, వాస్తవం కూడా.
కాదంటారా?

No comments:

Post a Comment